గుడ్‌న్యూస్‌.. ఆగష్టు 14 నాటికి క‌రోనా వ్యాక్సిన్!!

July 14, 2020 at 3:45 pm

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు తీవ్రంగా వ‌ణికిపోతున్నారు. గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. అన‌తికాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెందింది. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది.

అయితే ఈ ప్రాణాంత‌క వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకునేందుకు ప్రపంచ దేశాల శాస్త్ర‌వేత్త‌లు కరోనా వ్యాక్సీన్ కనిపెట్టే ప‌నిలో విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా తాజాగా కరోనా వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ చెప్పింది. సెచెనోవా యూనివర్సిటీ, గమేలియ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ మనుషులపై విజయవంతమయ్యాయి.

ఇక ఇందుకు సంబంధించిన టీకా మిగిలిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుని ఆగష్టు 12 నుంచి 14 మధ్యన ప్రజలకు అందుబాటులో ఉంటుందనే నమ్మకం తమకుందని గమేలియ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ జింటస్బర్గ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలు సెప్టెంబర్ నుంచి భారీగా ఉత్పత్తిని ప్రారంభించవచ్చునని ఆయ‌న స్పష్టం చేశారు.

గుడ్‌న్యూస్‌.. ఆగష్టు 14 నాటికి క‌రోనా వ్యాక్సిన్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts