యాంకర్‌ను ఓ రేంజ్‌లో ఏసుకున్న భానుమతి

July 1, 2020 at 10:35 am

టాలీవుడ్‌‌లో ఫిదా చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమా సక్సెస్‌తో ఏ రేంజ్‌కు వెళ్లిపోయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ బ్యూట నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో తక్కువ కాలంలోనే ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక సాయి పల్లవి చేసే ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుండటంతో ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఓ ప్రముఖ యాంకర్ సాయి పల్లవిని మలయాళ బ్యూటీ అంటూ సంబోధించింది. దీంతో సాయి పల్లవి ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆమె మలయాళ అమ్మాయిని కాదని, తాను కొయంబత్తూరులో పుట్టిపెరిగినా తన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు అంటూ చెప్పుకొచ్చింది. ఇంకెప్పుడూ తన ఐడెంటిటీని ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చేయడం సరికాదంటూ ఫైర్ అయ్యింది ఈ బ్యూటీ.

దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూ చేస్తు్న్న వారు నోరెళ్లబెట్టారు. అంతేగాక తనకు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు తనను అడగవద్దంటూ సాయి పల్లవి మండిపడింది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం లవ్‌స్టోరి, విరాటపర్వం, శ్యామ్ సింఘ రాయ్ వంటి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకునేందుకు ఈ బ్యూటీ రెడీ అయ్యింది.

యాంకర్‌ను ఓ రేంజ్‌లో ఏసుకున్న భానుమతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts