సీనియర్ నేతలు బాబుని నమ్మడం లేదా…? సుజనాతో ఎందుకు టచ్ లోకి…?

July 6, 2020 at 3:15 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంపై చాలా వరకు ఇప్పుడు అసహనం ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు చాలా వరకు ఆయన నాయకత్వంపై అసహనంగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. ఏకపక్షంగా కొన్ని కొన్ని నిర్ణయాలున్నాయి అని నాయకుల మీద కేసులు పెట్టిన సమయంలో న్యాయ పరంగా స్పందించే తీరు బాగా లేదని అంటున్నారు.

న్యాయ పరంగా పార్టీలో సరైన మద్దతు లేదు అని అంటున్నారు. ఇక ఇప్పుడు పార్టీలోని కీలక నేతలు బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి సీనియర్ నేత ఒకరు బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అనంతపురం నుంచి మాజీ ఎంపీ… నిమ్మల కిష్టప్ప అదే విధంగా విశాఖ జిల్లా నుంచి ఒక పది మంది నేతలు బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్ళారు. ఇటీవల ఒక కీలక నేతను టీడీపీ నేతలు కలిసారు అని వార్తలు వస్తున్నాయి.

రాజకీయంగా చంద్రబాబుకి ఇప్పుడు ఏ మాత్రం అవకాశాలు లేవు అని భావిస్తున్న నేతలు ఇప్పుడు తలో దారి చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొంత మంది నేతలు యాక్టివ్ గా ఉండాలి అని పార్టీ అధినేత నుంచి సూచనలు వచ్చిన సరే వాళ్ళు ఉండటం లేదు అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక సంచలనం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సీనియర్ నేతలు బాబుని నమ్మడం లేదా…? సుజనాతో ఎందుకు టచ్ లోకి…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts