వెన్నెలగా వ‌చ్చిన రాజశేఖర్ పెద్ద కూతురు..!!

July 1, 2020 at 3:19 pm

రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఇప్పటికే `దొరసాని` సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా హిట్ అవ్వ‌క‌పోయినా.. న‌ట‌న ప‌రంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. అయితే ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ కూడా వెండితెర‌పై ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. తాజాగా ఈమె నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

Rajasekhar Daughter Shivani's Debut Movie in Legal Trouble

జులై 1న శివానీ పుట్టిన రోజు సందర్భంగా ఈమె లుక్ విడుదల చేసింది చిత్ర‌యునిట్‌. వెన్నెల అనే పాత్ర‌లో శివాని ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించ‌ని ఈ చిత్రంలో తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తున్నారు. మ‌ల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. శివాని ఈ పోస్టర్‌లో మ‌న ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు.

శివానీ రాజశేఖర్ (shivani rajasekhar)

చుడీదార్ ధ‌రించి, గోడ మీద కూర్చొని, ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో ఏవో వింటూ స‌రిగ్గా పాత్ర పేరు వెన్నెల‌కు త‌గ్గట్లుగా ఆమె క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం శివాని లుక్ నెట్టింట్లో వైర‌ల్ మారింది. కాగా, వాస్త‌వానికి శివానీ2 స్టేట్స్ రీమేక్‌తోనే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. అడవి శేష్ హీరోగా మొదలైన ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాంతో ఇప్పుడు మరో సినిమాతో వస్తుంది శివానీ.

 

వెన్నెలగా వ‌చ్చిన రాజశేఖర్ పెద్ద కూతురు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts