షాకింగ్: ఏపీలో 24 గంటల్లో 1300 కేసులు

July 6, 2020 at 4:21 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు ఏపీలో నమోదు అవుతున్నాయి. నిన్నా మొన్నా దాదాపు వెయ్యి కేసుల వరకు నమోదు కాగా నేడు కూడా అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.

 

నేడు ఏకంగా 1300 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఏపీలో గత 24 గంటల్లో కరోనా 1322 మందికి సోకింది. రాష్ట్రంలోని 1263 మందికి సోకగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 56 మందిలో కరోనా సోకింది. ఇక ఏపీలో గత 24 గంటల్లో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు: 10860 ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 8 వేల మంది కోలుకున్నారు.

 

కరోనా పరిక్షలు గత 24 గంటల్లో 16 వేల 712 చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కట్టడిలో కీలకమైన పరీక్షలను వేగంగా చేసినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపధ్యమో పరీక్షలను కూడా రికార్డ్ స్థాయిలో ఏపీ సర్కార్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయని విధంగా 10 లక్షలకు పైగా కరోనా పరిక్షలు చేసారు.

షాకింగ్: ఏపీలో 24 గంటల్లో 1300 కేసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts