స్పీకర్ తమ్మినేని అందుకే తిరుమల వెళ్ళారా…?

July 10, 2020 at 4:07 pm

ఏపీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆయన కాస్త ఈ మధ్య దేవాలయాలు గుడుల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. సాధారణంగా భక్తుడు అయిన ఆయన తిరుమల రెండు సార్లు వెళ్ళారు. త్వరలోనే ఏపీ కేబినేట్ విస్తరణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆయన మంత్రి కావాలి అని మొదటి కేబినేట్ లోనే భావించారు.

కాని మాట కారి కావడంతో సిఎం జగన్ స్పీకర్ పదవి ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంత్రి కావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే కేబినేట్ విస్తరణ లో ఆయన మంత్రి పధవి కోసం విజయసాయి రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపై సిఎం జగన్ కు కాస్త సానుకూల అభిప్రాయమే ఉంది అని అంటున్నారు.

 

దీనితో ఆయన మంత్రి పదవి రావడం ఖాయమని భావించి దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు అని మొక్కు కూడా త్వరలో చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ ,పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్ళిన నేపధ్యంలో ఆ రెండు స్థానాలకు మంత్రి వర్గ కూర్పు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి. ఆయన బీసీ కావడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

స్పీకర్ తమ్మినేని అందుకే తిరుమల వెళ్ళారా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts