గిరిజన ప్రాంతాల్లో వైద్యులకు సరికొత్త సవాల్…!

July 11, 2020 at 6:08 pm

మన దేశంలో ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో కరోనా కేసుల తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు మనం వింటూనే ఉన్నాం. ఇక వర్షా కాలం వస్తే ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ తరుణంలోలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో వైద్యులకు సరికొత్త సవాల్ ఎదురవుతుంది.

హైదరాబాద్ లో కొన్ని ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధులతో కొందరు రోగులు బయటకు వస్తున్నారు. వారికి వైద్య పరిక్షలు చేయడానికి వైద్యులు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాల్లో వర్షాలు పడగానే కొన్ని వ్యాధులు సాధారణంగా బయటకు వస్తాయి. ఆ లక్షణాలు కూడా కరోనా లక్షణాల మాదిరిగానే ఉంటాయి. దీనితో ఇప్పుడు వైద్యుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.

 

ఏది కరోనా వైరస్ ఏది ఇతర వ్యాధి అనేది అర్ధం కావడం లేదు. రోజు రోజుకి కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనితో గిరిజన ప్రాంతాల్లో ఏపీ సర్కార్ ప్రజలు అందరికి కరోనా పరిక్షలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ మేరకు సిఎం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం ఖాయమని అంటున్నారు. లేకపోతే మాత్రం కరోనా ఇంకా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్యులకు సరికొత్త సవాల్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts