ఆ రెండు సిఎం జగన్ కు రెండు కళ్ళు…!

July 6, 2020 at 7:15 pm

దేశంలో ఎక్కడ చేయని విధంగా తమ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం రోజుకు 30వేల పరీక్షలు నిర్వహిస్తోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆయన రాయచోటిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలన మరింత సులభతరం అయిందని ఆయన వివరించారు. అర్హులైన వారికి అన్యాయం జరిగితే సచివాలయ సిబ్బందిదే నైతిక బాధ్యత ఆయన పేర్కొన్నారు.

10లక్షలకు పైగా పరీక్షలు చేయడమే కాకుండా పెద్ద సంఖ్యలో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం అదే విధంగా కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడిందని ఆయన కీర్తించారు. సిఎం వైఎస్ జగన్ ఒక పక్క కరోనాను ఎదుర్కొంటూనే సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్ళలాగ చేసుకోని పనిచేస్తున్నారని ఆయన అన్నారు. సిఎం జగన్ మాదిరి సంక్షేమాల షెడ్యూల్ ఇచ్చిన సీఎంలను గతంలో ఎప్పుడు చూడలేదన్నారు.

ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కోసం పేదలంతా కళ్ళల్లో వత్తులు వేసుకోని ఎదురు చూస్తున్నారన్న ఆయన… తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నదని ఆయన వివరించారు. పేద ప్రజల సామాజిక, సంక్షేమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. పేదవారు ఇంగ్లీష్‌లో చదవకుడదా… పేదలకు స్వంతిల్లు వద్దా అని ఆయన నిలదీశారు.

ఆ రెండు సిఎం జగన్ కు రెండు కళ్ళు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts