స్టార్ హీరో కాపురంలో టాలీవుడ్ యాంకర్ చిచ్చు…!

July 30, 2020 at 4:32 pm

వెండితెర మీద ఓ వెలుగు వెలిగి పోవాల‌న్న కోరిక ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది ప‌రిత‌పించి పోతూ ఉంటారు. త‌మ‌ను తాము ఒక్క‌సారి వెండితెర‌పై చూసుకుంటే చాలు అనుకునేందుకు ఫిల్మ్‌న‌గ‌ర్‌, కృష్ణాన‌గ‌ర్ ప్రాంతాల్లో ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా మందికి ఎంత టాలెంట్ ఉన్నా అవ‌కాశాలు ఊరుకునే రావు… ఈ అదృష్టం కొద్ది మందికే ఉంటుంది.. మ‌రి కొంద‌రు అవ‌కాశాల కోసం అడ్డ‌దారులు చాలా ఈజీగా తొక్కేస్తూ ఉంటారు.

 

ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు అవ‌కాశాల కోసం ఓ యాంక‌ర‌మ్మ పెద్ద హీరోను వ‌ల‌లో వేసుకుంద‌న్న వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ విష‌యం స‌ద‌రు స్టార్ హీరో భార్య‌కు కూడా తెలియ‌డంతో ఆమె ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింద‌ని అంటున్నారు. బుల్లితెర మీద ప‌లు పాపుల‌ర్ షోల‌తో మంచి పేరు తెచ్చుకున్న స‌ద‌రు యాంక‌ర‌మ్మ ఇప్పుడు వెండితెర‌పై ఉన్న శూన్య‌త‌ను యూజ్ చేసుకుని గ్లామ‌ర్ రోల్స్ కావాల‌ని అడుగుతోంద‌ట‌. ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఓ స్టార్ హీరోతో ఉన్న ప‌రిచ‌యాన్ని వాడుకుని ఆయ‌న బాగా ద‌గ్గ‌రైంద‌ట‌.

 

గ‌త కొంత కాలంగా వీళ్లు మ‌రింత క్లోజ్ అవ్వ‌డంతో పాటు ఆ యాంక‌ర‌మ్మ స‌ద‌రు స్టార్ హీరో ఇంటికి కూడా ఇటీవ‌ల రెండు మూడు సార్లు వెళ్లింద‌ట‌. వీరి క్లోజ్‌నెస్‌పై ఆరా తీసిన స‌ర‌దు స్టార్ హీరో భార్య త‌న భ‌ర్త అయిన ఆ స్టార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింద‌ట‌. మ‌రోసారి ఆమె ఇంటికి వ‌స్తే బాగోద‌ని… చెప్ప‌డంతో పాటు ఆ స్టార్ హీరోతో సినిమాలు లైన్లో ఉన్న నిర్మాత‌ల‌కు కూడా ఫోన్లు చేసి ఆమెకు ఎట్టి ప‌రిస్తితిలోనూ సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పేసింద‌ట‌. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్ హీరో కాపురంలో టాలీవుడ్ యాంకర్ చిచ్చు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts