ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సుజనా…?

July 3, 2020 at 10:33 am

ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఇప్పుడు బలం లేకపోయినా సరే ఆ పార్టీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదోక విధంగా విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారు గాని మొన్నటి వరకు అయితే రాష్ట్ర పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ బిజెపి సైలెంట్ కావడానికి ప్రధాన కారణం సుజనా చౌదరి అని కొందరు అంటున్నారు.

 

మరి కొందరు కన్నా లక్ష్మీ నారాయణ అని అంటున్నారు. ఏమీ లేదు రాష్ట్ర పార్టీ బాధ్యతలను తాను తీసుకునే ఆలోచనలో సుజనా ఉన్నారట. అందుకే బిజెపి నేతలు కొందరిని మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు అని పలువురు అంటున్నారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలి అని అప్పటి వరకు కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తూ ఉంటారని చెప్పడంతో కాస్త సైలెంట్ అయ్యారట.

 

మరి సైలెంట్ గా ఉండాలి అని చెప్పడం వెనుక వ్యూహం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని, టీడీపీ విమర్శలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు అందుకే సైలెంట్ గా ఉండాలి అని చెప్పారు అని మరి కొందరు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఎలా ఉన్నా సరే బిజెపి లో ఉన్నా సరే ఆయన టీడీపీ మీద చూపిస్తున్న ప్రేమ చూసి టీడీపీ నేతలు కూడా కాస్త షాక్ అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సుజనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts