బ్రేకింగ్: మంత్రి తలసానికి కరోనా భయం

July 1, 2020 at 4:45 pm

తెలంగాణాలో ఇప్పుడు కరోనా వైరస్ పేరు వింటే చాలు అక్కడి ప్రజల్లో భయం మొదలయింది. ప్రజలు అందరూ కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా సరే పరిస్థితి మాత్రం మారడం లేదు. అక్కడ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ప్రతీ రోజు పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ సహా నాలుగు జిల్లాల్లో కరోనా కేసుల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.

 

ఇక ఇదిలా ఉంటే… తాజాగా తెరాస నేతలు మంత్రులకు కరోనా భయం మొదలయింది. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కరోనా భయం పట్టుకుంది. ఇటీవల సికింద్రాబాద్ కంటైన్మెంట్ నియోజకవర్గం లో జరిగిన హరిత హారం కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలకు కరోనా సోకింది. దీనితో చాలా మంది ఉద్యోగులు హోం క్వారంటైన్ కి వెళ్ళారు.

 

ఇదే కార్యక్రమానికి మంత్రి తలసాని కూడా వెళ్ళారు. దీనితో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. మంత్రి నేడు లేదా రేపు కరోనా పరిక్షలు చేయించుకోవాలి అని అప్పటి వరకు ఇంట్లోనే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటుగా మరి కొందరు కూడా కరోనా పరిక్షలు చేయించుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

బ్రేకింగ్: మంత్రి తలసానికి కరోనా భయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts