ఉద్యోగులకు జీతాలు ఆగిపోవడానికి టీడీపీనే కారణం: తమ్మినేని

July 2, 2020 at 1:52 pm

ఆంధ్రప్రదేశ్ లో ద్రవ్య వినిమయ బిల్లుని శాసన మండలి సమావేశాల్లో అడ్డుకోవడంపై ఇప్పుడు అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇటీవల రాజధానికి సంబంధించిన బిల్లులతో పాటుగా, ద్రవ్య వినిమయ బిల్లుని కూడా అడ్డుకోవడంతో నిన్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు మరో రెండు మూడు రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఏపీ స్పీకర్ స్పందించారు.

మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని ఆయన టీడీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయని మండిపడ్డారు. అంతే కాకుండా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని తమ్మినేని వ్యాఖ్యలు చేసారు.

ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాత్మక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. 108,104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు జీతాలు ఆగిపోవడానికి టీడీపీనే కారణం: తమ్మినేని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts