లాక్ డౌన్ అడుగుతున్న తెలుగు సిఎంలు…?

July 13, 2020 at 10:02 am

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ ని కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అనధికారికంగా అధికారికంగా అమలు చేస్తూ వస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల మూడో వారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏదోక రోజు రాష్ట్రాల సిఎం లతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశంలో ఆయన ముందు లాక్ డౌన్ ని అమలు చేస్తామని ఏపీ, తెలంగాణా సిఎం లు చెప్పే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇదే మంచి మార్గం అని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి.తెలంగాణాలో కేసులు కాస్త తగ్గినా సరే ఏపీలో మాత్రం కరోనా భయపెడుతుంది. నిన్న దాదాపుగా 2 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.

 

రెండు మూడు రోజుల నుంచి ఏపీలో కేసులు పెరగడమే గాని తగ్గే అవకాశాలు అసలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. అందుకే సిఎం జగన్ ఇప్పుడు లాక్ డౌన్ మంచి మార్గం అని భావించి ప్రధానికి చెప్పేయాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం అనుమతి లేకుండా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి.

లాక్ డౌన్ అడుగుతున్న తెలుగు సిఎంలు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts