దేశంలో కరోనా సునామీ వచ్చేసింది, 24 గంటల్లో ఎన్ని వేల కేసులంటే

July 11, 2020 at 10:25 am

కరోనా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది గాని ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి పరీక్షలను వేగవంతం చేసినా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. దేశంలో 8 లక్షలు దాటిన కరోన పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో భారీగా నమోదు అయ్యాయి. గడిచిన నాలుగు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 

దేశంలో కరోన బాధితుల సంఖ్య 8, 20, 916 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 27, 114 పాజిటివ్ కేసులు నమోదు కాగా 519 మంది మృతి చెందారు అని కేంద్రం ప్రకటించింది. 2, 83, 407 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 5, 15, 385 గా ఉంది. ఇక దేశంలో మరణాలు కూడా 22 వేలు దాటాయి.

 

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 22, 123 మంది మృతి చెందారు అని కేంద్ర౦ పేర్కొంది. ఇక దేశంలో కరోనా పరీక్షలను పెంచారు. 3 లక్షల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో కోటి 13 లక్షల మందికి పైగా కరోనా పరిక్షలు చేసాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు.

దేశంలో కరోనా సునామీ వచ్చేసింది, 24 గంటల్లో ఎన్ని వేల కేసులంటే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts