దేశంలో భారీగా పెరుగుతున్న రికవరీ రేటు…?

July 3, 2020 at 5:46 pm

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి తీసుకునే చర్యలు కూడా పెద్దగా దేశంలో ఫలించడం లేదు. కరోనా విషయంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే దాని పని అది చేస్తూ పోతుంది. ఇక దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తీసుకునే చర్యలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏ మాత్రం ఫలించడం లేదు.

ఇక లాక్ డౌన్ ని అమలు చేసినా సరే కరోనా మాత్రంఆగడం లేదు. ఈ తరుణంలో దేశానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి శాతం భారీగా పెరుగుతుంది అని పేర్కొంది. దేశంలో కరోనా నుంచి 60 శాత౦ మందికి పైగా కోలుకున్నారు అని కేంద్ర సర్కార్ తాజాగా విడుదల చేసిన లెక్కల్లో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 60.73 శాతం మంది కోలుకున్నారు.

ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు అధికంగా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర సహా కేరళ లో రికవరీ రటు భారీగా ఉంది. కరోనా కట్టడిలో పరిక్షలు కూడా ఈ రాష్ట్రాలు భారీగా చేస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి కోలుకునే వారిని హోం క్వారంటైన్ లో 28 రోజులు ఉండటమే మంచిది అని వైద్యులు చెప్తున్నారు.

దేశంలో భారీగా పెరుగుతున్న రికవరీ రేటు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts