హైదరాబాద్ లో నర్సుల కొరత…? కేరళ నుంచి హైదరాబాద్ కు నర్సులు…?

July 6, 2020 at 7:47 pm

హైదరాబాద్ లో ఇప్పుడు కరోనా కట్టడి కావాలి అంటే కచ్చితంగా మెరుగైన వైద్యం అందాల్సి ఉంటుంది. మెరుగైన వైద్యం అందలేదు అంటే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు. వైద్య సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలి అందుబాటు లో ఉండాలి. లేదు అంటే మాత్రం కరోనా తీవ్రత ప్రభావం ఇంకా పెరగడమే కాదు మరణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఇంకో విషయం ఏంటీ అంటే హైదరాబాద్ లో ఒక సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెడుతుంది. కరోనా హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతున్న సమయంలో చాలా మంది నర్సులు భయంతో తమ ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి కొరత బాగా కనపడుతుంది. వైద్యులను పట్టించుకునే నర్సులు ఎక్కడా కనపడటం లేదు. రోజు రోజుకి కూడా ఆందోళనకరంగా ఈ పరిస్థితి.

కరోనా కట్టడికి సత్వర చర్యలు చేపట్టినా కేసులు పెరుగుతున్నా సరే ఈ స్థాయిలో పరిస్థితి ఉండటంపై సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఇక నర్సుల కొరత తీవ్రంగా ఉండటంతో కేరళ నుంచి హైదరాబాద్ కి నర్సులను తీసుకుని రావాలి అని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ యోచనలో పడింది. త్వరలోనే మరింత మంది నర్సులను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో నర్సుల కొరత…? కేరళ నుంచి హైదరాబాద్ కు నర్సులు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts