టీడీపీలో త్వరలో బాంబ్ పేలే అవకాశం…?

July 14, 2020 at 6:43 pm

తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పార్టీలో సీనియర్ నేతలను చాలా మందిని ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారు అని పదే పదే మీడియా ముందు ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుగా నిలిచింది కేవలం ఒక్క నేతకు మాత్రమే. అచ్చెన్నాయుడు మినహా ఆయన ఎవరికి అండగా నిలవలేదు.

గంటా శ్రీనివాసరావు, అఖిల ప్రియ, రాయలసీమకు చెందిన జేసి దివాకర్ రెడ్డి, అదే విధంగా కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు, కృష్ణా జిల్లాకు చెందిన మరికొందరు నేతలు, అదే విధంగా ఉత్తరాంధ్ర కు చెందిన అయ్యన్న పాత్రుడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ఉన్నా సరే చంద్రబాబు నుంచి మాత్రం మద్దతు లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు ని వదిలించుకోవాలి అని భావిస్తున్నారు.

 

అగ్ర నేతలుగా ఉన్న వారు అన్ని ఇబ్బందులు పడుతున్నా సరే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు పక్షపాత రాజకీయాలు చేయడం దారుణం అని పార్టీ కోసం చాలా నష్టపోయామని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అసహనంగానే ఉన్నారట. త్వరలోనే టీడీపీ లో ఒక బాంబు పేలే అవకాశం ఉంది అని అంటున్నారు.

టీడీపీలో త్వరలో బాంబ్ పేలే అవకాశం…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts