ఏపీ తెలంగాణా మధ్య బస్సు సర్వీసులు లేనట్లేనా…?

July 2, 2020 at 3:18 pm

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు లేనట్లే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దాదాపు మూడు నెలల పాటు ఈ సర్వీసులు ఉండే అవకాశం లేదని కొన్ని వ్యాఖ్యలు పరిశీలకుల నుంచి ఎక్కువగా వినపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో కరోనా కేసుల దెబ్బకు ప్రభుత్వం భయపడుతుంది.

కేంద్ర సర్కార్ కూడా హైదరాబాద్ లో కరోనా కేసులపై ఆరా తీయడం మొదలు పెట్టింది. కేసులు ఇదే విధంగా పెరిగితే ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని కేంద్రం కూడా భావిస్తుంది. ఇక ఇప్పుడు కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ అడుగులు వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య బస్సు రవాణా అనేది మొదలైతే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

సరిహద్దుల విషయంలో ఏపీ సర్కార్ కాస్త సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. డీజీపీ గౌతం సవాంగ్ పాస్ లేని వారిని అనుమతించే సమస్యే లేదని చెప్పారు. అంటే ఇప్పట్లో బస్సులు లేవు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. సరిహద్దుని పంచుకున్న 7 జిల్లాల విషయంలో… ఇప్పుడు అధికారులు కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నారు. కేసులు పెరిగే సూచనలు ఉండటంతో సిఎం జగన్ కూడా అధికారులకు స్వేచ్చ ఇచ్చారు.

ఏపీ తెలంగాణా మధ్య బస్సు సర్వీసులు లేనట్లేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts