టీడీపీలో నెక్ట్స్ వికెట్లు ఇవే… టీడీపీ ఖాళీకి పెద్ద టైం పట్టేలా లేదే…?

July 31, 2020 at 5:38 pm

టీడీపీలో రోజు రోజుకు ప‌రిస్థితులు దిగ‌జారుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ కి చెందిన ముగ్గురు కీలక నేతలు ఆల్రెడీ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. బెయిలు కూడా తెచ్చుకోలేక అవస్థలు వారివి. ఇక పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రులుగా ఉన్న ఇద్ద‌రు కీల‌క నేత‌లు అయిన వియ్యంకులు ఇద్ద‌రు ఇప్పుడు అనేకానేక కేసుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. ఇప్పుడు వీరిలో ఒక‌రిని చంద్ర‌బాబు ప‌ట్టించుకోకుండా ఉంటే మ‌రో నేత ఏకంగా చంద్ర‌బాబునే లైట్ తీస్కొంటున్నార‌ట‌. ఆ ఇద్ద‌రు వియ్యంకులు ఎవ‌రో కాదు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, పొంగూరు నారాయ‌ణ‌. వీరిలో గంటా గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేం లేదు. ఆయ‌న పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న బాబును ప‌ట్టించుకోవ‌డం వ‌దిలేశారు. ఇక నారాయ‌ణపై అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా… బాబు మిగిలిన నేత‌ల విష‌యంలో స్పందించిన‌ట్టు ఆయ‌న విష‌యంలో స్పందించ‌డం లేద‌ని అంటున్నారు.

ఇక వీరిద్ద‌రు ముందు వైసీపీలో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా ఒక‌రి ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయంటున్నారు. మ‌రో నేత మాత్రం కాషాయ కండువా క‌ప్పుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో పాటు త‌న బావ‌గారిని కూడా అటు వైపు లాగేసి త‌న ద‌మ్మేంటో చూపించుకోవాల‌నుకుంటున్నార‌ట‌. వీరిలో టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు బాగా ఫండింగ్ చేసిన ఒక నేత మాత్రం బీజేపీలోకి వెళ్లిపోవాల‌ని చ‌ర్చ‌లు మొద‌లు పెట్టేశార‌ట‌. పైగా త‌మ వ‌ర్గానికే చెందిన ఆకుల వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు అవ్వ‌డం కూడా వీరికి క‌లిసి రానుంద‌ని అంచ‌నా. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా ఉన్నంత కాలం ఆయ‌న చంద్ర‌బాబు చేతిలో డ‌మ్మీ అయ్యార‌న్న‌ది తెలిసిందే.

ఇప్పుడు బాబును ఎప్పుడూ వ్య‌తిరేకించే ఆకుల వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు అవ్వ‌డంతో టీడీపీ వాళ్లు కూడా ర‌క‌ర‌కాల భ‌యాల‌తో హ‌డ‌లి పోతున్నారు. ఇక కింజార‌పు కుటుంబ స‌భ్యులు కూడా ముడుపులు బాబుకు కేసులు మాకా ? అన్న ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. క‌నీసం బెయిల్ విష‌యంలో కూడా సాయం చేయ‌డం లేద‌ని వాపోతున్నార‌ట‌. ఇక జేసీ బ్ర‌ద‌ర్ అయితే ఇంత క‌ష్ట‌కాలంలో ఉంటే త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న‌లో ఉన్నార‌ట‌. లోకేష్ ప‌రామ‌ర్శించ‌డం మిన‌హా బాబు కూడా క‌నీసం ప‌ల‌క‌రించిన పాపం లేదు. దీంతో అటు పైన చెప్పిన వియ్యంకులు, జేసీ ఫ్యామిలీతో పాటు మ‌రి కొంద‌రు కాపు నేత‌లు కూడా ఇప్పుడు కాషాయం వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో టీడీపీ ఖాళీ అవ్వ‌డానికి పెద్ద టైం ప‌ట్టేలా లేదు.

టీడీపీలో నెక్ట్స్ వికెట్లు ఇవే… టీడీపీ ఖాళీకి పెద్ద టైం పట్టేలా లేదే…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts