జ‌గ‌న్‌కు ఇది పెద్ద షాకే…!

July 31, 2020 at 8:43 am

ఏపీ ప్ర‌భుత్వానికి ఇటీవ‌ల కోర్టుల్లో వ‌రుస పెట్టి ఏదో ఒక షాకు త‌గులుతూనే ఉంది. వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వానికి అయినా కోర్టుల్లో మొట్టికాయ‌లు త‌గ‌ల‌డం… ప్ర‌భుత్వం ఒక్కో సారి ప‌రిధి అతిక్ర‌మించి వెళుతుంది అనుకున్న టైంలో కాస్త వార్నింగ్ ఇవ్వ‌డం మామూలే. గ‌త యేడాది పాల‌నా కాలంలో జ‌గ‌న్ పాల‌నా ప‌రంగా ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. విప‌క్షాల‌కు, ఆయ‌న వ్య‌తిరేకుల‌కు కూడా విమ‌ర్శించ‌డానికి ఏ సందు లేదు. అంతెందుకు వ‌లంటీర్లు, గ్రామ స‌చివాల‌యాలు ఇలా చెప్పుకుంటూ పోతే జ‌గ‌న్ ఎన్నో స‌రికొత్త మార్పులు పాల‌న‌లోకి తీసుకు వ‌చ్చారు.

ఇక ఇప్పుడు మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, జిల్లాల విభ‌జ‌న కూడా జ‌రిగితే జ‌గ‌న్ మ‌రో చ‌రిత్ర లిఖించ‌డం ఖాయం. ఇవ‌న్నీ ఇలా ఉంటే కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ దూకుడుగా ఉండ‌డంతో పాటు పంతానికి పోవ‌డం వ‌ల్లే కోర్టుల్లో కాస్త ఇబ్బందులు వ‌స్తున్నాయ‌న్న‌ది నిజం. ఇలాంటి విష‌యాల్లో జ‌గ‌న్ త‌న‌కు టైం క‌లిసొచ్చే వ‌ర‌కు పంతానికి పోకుండా ఉంటే అస‌లు జ‌గ‌న్‌కు ఈ కోర్టు ప్ర‌శ్న‌లు, విప‌క్షాల నుంచి ఈ చిన్న‌పాటి విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చేవే కావు. ఇక ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు కావ‌చ్చు..

ఇక ఇప్ప‌డు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ విష‌యంలో జ‌గ‌న్ పంతానికి పోయి విమ‌ర్శ‌లు కొని తెచ్చుకున్న‌ట్టే ఉంది. నిమ్మ‌గ‌డ్డ‌ను తొల‌గించ‌డం.. ఆ వెంట‌నే జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌ను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మించ‌డం జ‌గ‌న్ చ‌క‌చ‌కా చేసేశారు. ఇక హైకోర్టు ఉత్త‌ర్వులు వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ నిమ్మ‌గ‌డ్డ‌ను తిరిగి ఎన్నికల క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగించే విష‌యంలో త‌ట‌ప‌టాయించారు. ఈ విష‌యం హైకోర్టు నుంచి చివ‌ర‌కు సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లింది. అక్క‌డ నిమ్మ‌గ‌డ్డ‌కు అనుకూలంగానే తీర్పు వ‌చ్చింది. ఇప్పుడు ఏపీ‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిమ్మ‌గ‌డ్డ‌ను తిరిగి నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు గవర్నర్ బిశ్వ‌భూషణ్‌ హరిచందన్ పేరిట పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ తుది తీర్పునకు లోబడి నోటిఫికేషన్‌ ఉంటుందని అందులో స్పష్టం చేశారు. ఏదేమైనా నిమ్మ‌గ‌డ్డ విష‌యంలోనే కాదు ఇక‌పై జ‌గ‌న్ ఏ విష‌యంలో అయినా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శలు లైట్ తీస్కొన్నా కోర్టుల నుంచి విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌డ‌మే మంచిది.

జ‌గ‌న్‌కు ఇది పెద్ద షాకే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts