కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ ఇదే…!

July 14, 2020 at 5:31 pm

దేశంలో రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఐసిఎంఆర్ తో కలిసి సంయుక్తంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ వెల్లడించారు. అదే విధంగా 18 రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉందని అది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని చెప్పింది.

 

10 రాష్ట్రాల్లోనే 86 శాతం కేసులు ఉన్నాయని ఆయన వివరించారు. వీటిలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే 50 శాతం కేసులు ఉన్నాయని… మిగిలిన 8 రాష్ట్రాల్లో 36 శాతం కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో 20 రాష్ట్రాల్లో రికవరి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. గుజరాత్‌లో 70 శాతం రికవరీ రేటు ఉందని ఆయన వివరించారు. ఓడిశాలో 67 శాతం, తమిళనాడులో 65 శాతం ఉందని చెప్పారు.

 

దేశంలో కరోనా ప్రభావం మార్చి మధ్య నుంచి ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. మే ప్రారంభంలో రికవరీ రేటు 26 శాతంగా ఉందన్న ఆయన మే చివరికి 48 శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు. జులై 12 నాటికి 63 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మే 2 నుంచి మే 30 వరకు దేశంలో కరోనా కేసులు రికవరీ కేసుల కంటే అధికంగా ఉండేవన్న ఆయన… ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts