ఎల్జీ పాలిమర్స్ లో హైపవర్ కమిటీ చెప్పిన విషయాలు ఇవే…!

July 6, 2020 at 4:56 pm

రెండు నెలల క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించిన నివేదికను హైపవర్ కమిటీ సిఎం వైఎస్ జగన్ కు నివేదించింది. ఈ నివేదికలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. హైపవర్‌ కమిటీ చైర్మన్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 350 పేజీల రిపోర్ట్‌ను సీఎం జగన్‌కు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో 12మంది మృతిచెందారని ఆయన అన్నారు.

 

585మంది అస్వస్థతో ఆస్పత్రిలో చేరారని ఆయన తమ నివేదికలో ప్రస్తావించామని అన్నారు. ప్రజల నుంచి 1250 ప్రశ్నలు, 250 ఈమెయిల్‌లు, 180 ఫోన్‌కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని ఆయన ప్రభుత్వానికి నివేదించామని అన్నారు. అదే విధంగా ట్యాంక్‌లో టెంపరేచర్‌ పెరగడంతో ప్రెజర్‌ ఏర్పడి గ్యాస్‌ లీకైందన్నారు. ట్యాంక్‌ డిజైన్‌, కూలింగ్‌ సిస్టమ్‌ సరిగా లేకపోవడం ఒక కారణం అయితే… సిబ్బందికి అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు.

 

అదే విధంగా 2019 డిసెంబర్‌లో పైపింగ్‌లో మార్పులు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. పైపింగ్‌లో మార్పులతో సిస్టమ్‌ డిస్టర్బ్‌ అయిందని చెప్పుకొచ్చారు. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు సైరన్‌లు మోగలేదన్నారు ఆయన. నియంత్రణ వ్యవస్థలో కొన్ని లోపాలు గుర్తించామని చెప్పారు. ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డు ఏర్పాటుకు సూచించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇక ఈ నివేదికలో బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా ఆయన సూచించారు.

ఎల్జీ పాలిమర్స్ లో హైపవర్ కమిటీ చెప్పిన విషయాలు ఇవే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts