భారత్‌లో టిక్‌టాక్‌ యాప్ బ్యాన్ వ‌ల్ల ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలుసా..?

July 2, 2020 at 4:25 pm

టిక్‌టాక్‌.. ఈ యాప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిగిలిన దేశాల క‌న్నా.. భార‌త్‌లోనే ఆ యాప్‌ను ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. తక్కువ కాలంలోనే విపరీతంగా ఫేమస్‌ అయి.. కోట్లాది మంది యూజర్లను ఆకర్షించి ఈ చైనా యాప్‌. మ‌రియు సామాన్యులకు స్టార్‌ స్టేటస్‌ తీసుకొచ్చింది ఈ టిక్‌టాక్. వెండితెర, బుల్లితెర నటీనటులకు మించిన ఫాలోయింగ్‌ను సామాన్యులకు కట్టబెట్టింది.

అయితే చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో స‌హా.. 59 చైనా యాప్లను నిషేధింది. ఇక ఈ మొత్తం యాప్స్‌లలో ఎక్కువగా ఎఫెక్ట్‌ పడిన యాప్ ఏదంటే టిక్‌టాక్‌ అనే చెప్పవచ్చు. అయితే టిక్‌టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేశాక చాలా మంది టిక్‌టాక్‌ యూసర్లు, టిక్‌టాక్‌ ఫేమస్ స్టార్లు తమ ఫలోవర్స్ ని పోగొట్టుకొకుండా ఉండడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ పై దృష్టి పెట్టారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం కావడం ద్వారా.. చైనా సంస్థ బైట్‌డ్యాన్స్‌కు రూ.45 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌లో నిషేధం తర్వాత బైట్‌డాన్స్‌ 6 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.45 వేల కోట్లు నష్టపోవచ్చని వెల్ల‌డించింది. ఏదేమైనా.. భార‌త ప్ర‌భుత్వం.. చైనాతో పాటు టిక్‌టాక్‌కు కూడా గ‌ట్టి దెబ్బ ఇచ్చ‌న‌ట్టు అయింది.

భారత్‌లో టిక్‌టాక్‌ యాప్ బ్యాన్ వ‌ల్ల ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts