నిషేధంపై కోర్టుకెళ్లేందుకు య‌త్నించిన‌ టిక్‌టాక్‌.. ఆదిలోనే ఎదురు దెబ్బ‌‌..!!

July 1, 2020 at 3:36 pm

టిక్‌టాక్.. భార‌త్‌లో ఏ యాప్‌ను కోట్ల‌మంది వాడేవారు. ఈ క్ర‌మంలోనే అతి త‌క్కువ సమయంలో అత్యంత ప్రజాధరణ పొందింది ఈ యాప్. అయితే చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన ముఖ్యమైన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో కోట్లాది మంది భారతీయులు వినియోగించే టిక్‌టాక్‌ యాప్‌ కూడా ఉంది.

ఇప్పటికే కేంద్రం ఆదేశం మేర‌కు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించగా.. తాజాగా టిక్ టాక్ పూర్తిగా పనిచేయడం లేదు. కొత్తగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేకపోగా.. ఫోన్లలో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు పనిచేయడం లేదు. స్క్రీన్‌పై ‘నో నెట్‌వర్క్ కనెక్షన్’ అని మెసేజ్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ సంస్థ‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నాలు జరుపుతోంది.

ఇందులో భాగంగా.. టిక్‌టాక్‌ తరుఫున న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసి, వాదించాలని ఆ సంస్థ మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహత్గిని కోరగా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. వారి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరుఫున ఆ పని చేయబోనని స్పష్టం చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించాలనుకుంటోన్న టిక్‌టాక్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. గతంలోనూ ఓ సారి టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా ఆ సంస్థ కోర్టుకెళ్లింది.

నిషేధంపై కోర్టుకెళ్లేందుకు య‌త్నించిన‌ టిక్‌టాక్‌.. ఆదిలోనే ఎదురు దెబ్బ‌‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts