సచివాలయం కూల్చివేతకు బ్రేక్ వేసిన హైకోర్టు.. రీజ‌న్ ఏంటంటే..??

July 10, 2020 at 3:21 pm

తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పాత సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దశాబ్దాల చరిత్రకు, ఎన్నో కీలక ఘట్టాలకు మౌన సాక్ష్యాలుగా నిలిచిన సచివాలయ భవనాలు ఒక్కొక్కటిగా నేలకూలుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో సెక్రటేరియట్ కూల్చివేత పనులకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

సోమవారం వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

భవనాల కూల్చివేతతో వాతావరణం కాలుష్యమవుతోందని చెప్పారు. మున్సిపల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స‌చివాల‌యం కూల్చివేత పనుల‌కు బ్రేక్ ప‌డింది.

సచివాలయం కూల్చివేతకు బ్రేక్ వేసిన హైకోర్టు.. రీజ‌న్ ఏంటంటే..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts