ఏపీ కేబినెట్ లోకి వచ్చే యువ నేతలు వీళ్ళే

July 7, 2020 at 3:11 pm

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ మార్పుల విషయంలో ఇప్పుడు కాస్త ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి. సిఎం జగన్ అవకాశం ఇచ్చే నేతలు ఎవరూ అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రత్యేకంగా చూస్తున్న కొన్ని సోషల్ మీడియాలో ఖాతాలలో ఇప్పుడు కాబోయే మంత్రుల గురించి పెద్ద చర్చలే జరుగుతూ వస్తున్నాయి మరి.

 

మంత్రి వర్గంలోకి వచ్చే యువనేతలు ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశాఖ జిల్లాకు చెందిన అధీప్ రాజ్ యువ మంత్రిగా మంత్రి వర్గంలోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా దేవినేని అవినాష్ ని ఎమ్మెల్సీ ని చేసి మంత్రిని చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మరికొందరు నేతలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జలవనరుల శాఖ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.

 

అదే విధంగా అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కూడా కేబినేట్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు సిఎం జగన్ కంట్లో ఉన్నారు అని అంటున్నారు. వీరిని కేబినేట్ లోకి తీసుకోవడం ఖాయమని చర్చలు జరుగుతున్నాయి. కొందరికి ఉద్వాసన కూడా పలికే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఏపీ కేబినెట్ లోకి వచ్చే యువ నేతలు వీళ్ళే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts