మోడీ చైనా సరిహద్దుల్లో పర్యటనపై అమెరికా ఆసక్తి…!

July 3, 2020 at 6:50 pm

భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రెండు దేశాల మధ్య పరిస్థితులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా చైనా భారీగా తమ అర్మీని సరిహద్దుల్లో మొహరించే ప్రయత్నం చేస్తుంది. దీనిపై భారత్ కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ భారత్ చైనా సరిహద్దులకు వెళ్ళారు.

ఎత్తైన భూభాగం లోకి వెళ్ళారు ఆయన. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉండే భూభాగం మీద ఆయన అడుగు పెట్టి సైనికులకు అన్ని విధాలుగా స్వేచ్చ ఇచ్చారు. వారిని ముందు ఉండి ప్రోత్సహించారు. భారత సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికి మర్చిపోయే అవకాశం లేదని అన్నారు ఆయన. ఇక ఇదిలా ఉంటే సరిహద్దుల్లో భారీగా బలగాలను మొహరిస్తుంది భారత్.

మోడీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత భారీగా బలగాలను పంపే అవకాశం ఉంది. ఇప్పుడు దీనిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక మోడీ పర్యటనపై అమెరికా కూడా ఆరా తీసింది. ఆయన ఎందుకు వెళ్ళారు అనే దానిపై కొందరి నుంచి వివరాలను సేకరించింది. భారత చైనా సరిహద్దుల్లో జరిగే వాటిని తమ నిఘా సంస్థల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

మోడీ చైనా సరిహద్దుల్లో పర్యటనపై అమెరికా ఆసక్తి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts