విజయసాయి రెడ్డికి కరోనా భయం…?

July 10, 2020 at 2:46 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా వైరస్ సంచలనంగా మారింది. అధికార పార్టీ నేతలకు ఈ కరోనా వైరస్ కంటి మీద కునుకు ఉంచడం లేదు. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే అధికార పార్టీ నేతలు క్రమంగా కరోనా బారిన పడటం ఇప్పుడు సిఎం జగన్ ని కూడా ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి. రోజు రోజుకి కరోనా కేసులు ఎమ్మెల్యేల్లో కూడా పెరుగుతున్నాయి.

ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే విజయసాయి రెడ్డికి కరోనా భయం పట్టుకుంది. ఇటీవల తమ్మినేని సీతారాం తో కలిసి ఆయన ఆముదాలవలస లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా వచ్చారు. ఆయన కుమారుడు కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరు అందరూ కలిసి లంచ్ కూడా చేసారు అని టాక్.

 

దీనితో ఇప్పటికే స్పీకర్ తన ఆఫీస్ ని మూసి వేసి కరోనా దెబ్బకు ఎవరిని తన వద్దకు రావొద్దు అని 15 రోజుల పాటు హోం క్వారంటైన్ కి వెళ్ళిపోయారు అని టాక్. ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డికి కూడా కరోనా భయం మొదలయింది. ఆయన స్వేచ్చగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరుగుతున్నారు అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నా సరే జాగ్రత్తగానే ఉన్నారు ఆయన. ఇక ఇప్పుడు మంత్రికి కరోనా రావడం ఆయనతో కలిసి డిన్నర చేయడం తో అసలు ఎం జరుగుతుందో ఆందోళన వైసీపీ నేతల్లో నెలకొంది.

విజయసాయి రెడ్డికి కరోనా భయం…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts