టీడీపీని కీర్తిస్తూ చంద్రబాబుని తిట్టిన విజయసాయి సాయి…!

July 11, 2020 at 12:15 pm

ఈ మధ్య ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి చేస్తున్న ట్వీట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలు టీడీపీ బిజెపి సహా ఇతర పార్టీల వర్గాల్లో చర్చలకు కూడా దారి తీస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడినా సరే గతంలో మీడియా కాస్త ప్రాధాన్యత ఇచ్చేది. ఇప్పుడు ఆయన ట్వీట్ లకు కాస్త ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుంది. తాజాగా ఆయన టీడీపీకి సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.

“చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు.” అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా షేర్ చేస్తున్నారు.

 

ఆయన మాట్లాడిన మాట వాస్తవం అంటూ పలువురు కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు. చంద్రబాబు కారణంగానే పార్టీ నాశనం అయింది అని అంటూ విజయసాయి ఇన్నాళ్ళకు తమ పార్టీ మీద ఒక మంచి అభిప్రాయం చెప్పారు అని టీడీపీ పొగుడుతూ చంద్రబాబు విధానాలను ఆయన కరెక్ట్ గా చెప్పారు అంటూ విజయసాయి ట్వీట్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

టీడీపీని కీర్తిస్తూ చంద్రబాబుని తిట్టిన విజయసాయి సాయి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts