విశాఖను పూర్తి పరిపాలనా రాజధానిగా మారుస్తాం: అవంతి

July 10, 2020 at 4:58 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపై పర్యటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన భీమిలి‌ నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో శుక్రవారం రూ. 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు మంత్రి. పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని అన్నారు.

పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని ఈ సందర్భంగా వివరించారు. సిఎం జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ రోజు రూ. 4.5 కోట్లతో మధురవాడ ప్రాంతంలో అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశామని ఈ సందర్భంగా వివరించారు.

 

అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని అన్నారు. విశాఖ నగరం 2019 కి ముందు ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారని అన్నారు. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్ ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నమని అన్నారు.

విశాఖను పూర్తి పరిపాలనా రాజధానిగా మారుస్తాం: అవంతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts