చంద్రబాబు రికార్డులు ఎందుకు బయటపెట్టడం లేదు…?

July 2, 2020 at 3:53 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు వ్యవహారంలో ఇప్పుడు టీడీపీ నేతలు లాక్కోలేక పీక్కోలేక బాధలు పడుతున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని ప్రభుత్వ౦ చూస్తుంది అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆయనను కావాలని ఇరికించారు అంటున్నారు.

 

బీసీ కార్డుపై ఇప్పుడు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన విషయంలో ఏసీబీ ఏ విధంగా అడుగులు వేస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది పక్కన పెడితే… ఆయన విషయంలో టీడీపీ నేతలు చెయ్యాల్సిన వ్యాఖ్యలు చేయడం లేదు అని పరిశీలకులు అంటున్నారు. ఆయన అవినీతి చేయలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అనడం లేదు.

 

ఆయన సిఎం గా ఉన్నప్పుడే ఆ వ్యవహారం జరిగింది కాబట్టి ఇవిగో రికార్డులు అసలు అవినీతి లేదని చెప్పడం లేదు. తప్పుడు కేసులు అనే ఆరోపణ మినహా ఆయన అవినీతి చేయలేదు అనే దానిని కనీసం వారి వద్ద ఉన్న వనరుల తో కూడా నిరూపించలేని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ నేతలు. దీనితో ఇప్పుడు రాజకీయం కాస్త ఆసక్తికరంగా మారింది. మరి ఆయన విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి.

చంద్రబాబు రికార్డులు ఎందుకు బయటపెట్టడం లేదు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts