కరోనా వార్డుల్లో డాక్టర్‌గా కి`లేడీ` మోసాలు.. చివ‌ర‌కు..

July 30, 2020 at 2:55 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అవ్వడంతో.. క‌రోనా మ‌రింత వేగంగా విస్త‌రిస్తోంది. అయితే కరోనా రోగి దగ్గరకు వెళ్లాలంటేనే కుటుంబ సభ్యులు సైతం బిక్కుబిక్కుమంటున్న‌ పరిస్థితుల్లో ఓ మాయలాడి ఏకంగా వైద్యురాలి వేషంలో కరోనా వార్డుల్లో మొబైల్ ఫోన్లు కొట్టేస్తూ, రోగుల బంధువుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతోంది.

చివ‌ర‌కు కటకటాల వెనక్కి చేరింది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో కాదు..విజయవాడ ప్రభుత్వాసుపత్రి జ‌రిగింది. పూర్తివివ‌రాల్లోకి వెళ్తే.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ పేరుతో కోవిడ్ పేషెంట్స్ వార్డులలో సంచరించిన శైలజ అనే మహిళ కాసేపు హడావిడి చేసింది. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ డబ్బు వసూళ్ళకు పాల్పడింది.

అయితే ఆ నకిలీ మహిళా డాక్టర్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో… సెక్యూరిటీ సిబ్బంది అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ డాక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్ర‌మంలోనే తాను ప్రసాదంపాడులో ఉంటానని, తన భర్త పేరు సత్యనారాయణ అని వెల్లడించింది. తాను బీఏఎంస్ చదివానని తెలిపింది. కాగా, శైలజపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్ల‌డించారు.

కరోనా వార్డుల్లో డాక్టర్‌గా కి`లేడీ` మోసాలు.. చివ‌ర‌కు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts