ఎక్కడ జగన్, ఎక్కడ చంద్రబాబు: శ్రీకాంత్ రెడ్డి

July 1, 2020 at 1:27 pm

ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ ప్రజారోగ్యం విషయంలో గొప్పగా ఆలోచించారు అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా జగన్ సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేశామని ఆయన అన్నారు. ప్రజలను ఆరోగ్య వంతులను చేసే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. తాము నిధులను ప్రకటించడమే కాదు అని వారికి అందే వరకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

మీరు గతంలో చేసిన కార్యక్రమాలను అప్పుడే మర్చిపోయారా అంటూ ఆయన నిలదీశారు. తాము అమ్మ ఒడి, జగన్నన విద్యా దీవెన, వాహన మిత్ర ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 1088 అంబులెన్స్ లు గొప్ప కార్యక్రమని ఆయన అన్నారు. 6 నెలల్లోనే పేదల సంక్షేమం కోసం 28 వేల కోట్ల 122 కోట్లు ఖర్చు చేసామని ఆయన పేర్కొన్నారు. కులం మతం పార్టీ చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.

ఇంత మంచి చేస్తున్నా సరే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవినీతిని బయటకు తీస్తుంటే ఇలా రోడ్ల మీదకు వచ్చి అల్లరి చేస్తున్నారని, మీకు సిగ్గు లేదా అని నిలదీశారు. అచ్చెన్నాయుడు అవినీతి చేస్తుంటే కనపడుతున్నా సరే ఆయనను కులం కార్డు వెనకేసుకుని మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు. ఎక్కడ సిఎం జగన్, ఎక్కడ చంద్రబాబు నాయుడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఎక్కడ జగన్, ఎక్కడ చంద్రబాబు: శ్రీకాంత్ రెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts