దమ్ము ఉంటే రాజీనామా చెయ్: రఘుకి వైసీపీ ఎంపీల సవాల్

July 3, 2020 at 5:14 pm

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వెనుక బిజెపి ఉందని కొందరు అంటుంటే ఎవరు ఉన్నారో తెలియదు గాని ఆయన ఇలా మాట్లాడటం వెనుక బలమైన కారణం ఉంది అని అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఆయన వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసారు వైసీపీ ఎంపీలు.

 

ఈ సందర్భంగా ఎంపీలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆయనకు దమ్ము ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అని ఎన్నికలకు వెళ్తే ఎవరి దమ్ము ఏంటీ అనేది తెలుస్తుంది అని ఎంపీలు సవాల్ చేసారు. అసలు ఆయనకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందు పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలి అని ఎంపీలు వ్యాఖ్యానించారు. ఊహాజనితమైన విషయాలను ఊహించుకున్నారని అన్నారు.

 

ఆయనకు సిఎం జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు అని ఎంపీలు అన్నారు. ఆయన రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరి బొమ్మకు ఎంత విలువ ఉంధో అర్ధమవుతుంది అని ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ ఆయన ఉల్లంగించారు అని ఆయనను ఏ పార్టీ కూడా నమ్మే అవకాశం  లేదని వారు వ్యాఖ్యానించారు. ఆయనపైస్పీకర్ చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చారని అన్నారు.

దమ్ము ఉంటే రాజీనామా చెయ్: రఘుకి వైసీపీ ఎంపీల సవాల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts