వైసీపీ ఎంపీ వర్సెస్, ఎమ్మెల్యే…!

July 1, 2020 at 4:12 pm

గుంటూరు జిల్లాలో మరోసారి… వైసీపీ ఎంపీ కృష్ణ దేవరాయలు వర్సెస్ ఎమ్మెల్యే విడదల రజని గా వ్యవహార౦ మారిపోయింది. చిరుమామిళ్ళలో వైసీపీ నేత ఒకరిని పరామర్శించడానికి గానూ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వెళ్ళారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక వైసీపీ నేత కోటిరెడ్డి తనకు సమాచారం లేకుండా ఏ విధంగా వస్తారు అని నిలదీశారు. దీనికి ఎంపీ స్పందించారు…

 

తాను కేవలం పరామర్శకు మాత్రమే వచ్చాను అని అన్నారు. పరామర్శకు వచ్చినా సరే అడ్డుకోవడం పద్ధతి కాదని అన్నారు ఎంపీ. పరామర్శకు వచ్చాను అని ఎంపీ వివరించే ప్రయత్నం చేసినా సరే కోటిరెడ్డి అనే వైసీపీ నేత వినలేదు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన లావు… ఇలా అనధికారిక కార్యక్రమాలకు వచ్చినా సరే అడ్డుకోవడం అనేది పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు.

 

ఇక అడ్డుకున్నాది విడదల రజనీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు కూడా ఈ విషయంలో దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కోటిరెడ్డి కి సర్ది చెప్పి ఎంపీ కారుని అక్కడికి పంపించారు. దీనితో కాస్త వాతావరణం వేడెక్కి… గతంలో కూడా ఇదే విధంగా ఎంపీని… ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుని ఇబ్బంది పెట్టారు. ఇక ఎమ్మెల్యే మరిదిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

వైసీపీ ఎంపీ వర్సెస్, ఎమ్మెల్యే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts