ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు

August 19, 2020 at 1:40 pm

ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో త‌న‌దైన శైలీలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో అడుగు ముందుకేశారు. న‌వ‌రత్నాల‌ను అమ‌లు చేసే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన ఏపీ కేబినెట్ స‌మావేశం ముగిసింది. ఈ సంద‌ర్భంగా మంత్రులు, సీఎం ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు. ఆయా అంశాల‌కు సంబంధించి కేబీనెట్ ఆమోదం ల‌భించింది. సెప్టెంబ‌ర్ ఒక‌టిన వైఎస్ఎస్ ఆర్ సంపూర్ణ పోష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. అంగ‌న్‌వాడీల్లోని పిల్ల‌ల‌కు స‌రైన పోష‌కాహారాన్ని అందించ‌నున్నారు. అందుకు రూ.1800 కోట్లు వెచ్చించ‌నున్నారు.

అదేవిధంగా సెప్టెంబ‌ర్ 5వ తేదీన వైఎస్ఆర్ విద్యా కానుక ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు ఆర్థిక సాయం అంద‌జేయ‌డంతో పాటు షూస్‌, స్ట‌డీ మెటీరియ‌ల్‌తో ప‌లు ఉప‌క‌ర‌ణాల‌ను చేర్చ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 11 వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 90ల‌క్ష‌ల మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు భారీగా రుణాల‌ను అంద‌జేయ‌నున్నారు. 27వేల కోట్ల‌ను నాలుగు విడ‌త‌ల్లో చెల్లించ‌నున్నారు. అదేవిధంగా నూత‌న పారిశ్రామిక విధానానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts