కేసీఆర్‌పై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

August 22, 2020 at 2:24 pm

తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమ‌ర్శించ‌డంలో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మాట‌కు మాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ముఖ్య‌మంత్రిపై ఆయ‌న మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. శ్రీ‌శైలం విద్యుత్ ప్లాంట్‌లో సంభ‌వించిన అగ్నిప్ర‌మాదంపై అనుమానాల‌ను వ్య‌క్తం చేయ‌డమేగాక‌, అందులో కేసీఆర్ కుట్ర దాగి ఉంద‌ని ఆరోపించ‌డం ఇప్పుడు రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్న‌ది. విష‌యం ఏమిటంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌ల‌దోపిడీకి కేసీఆర్ స‌హ‌క‌రిస్తున్నార‌ని, అందులో భాగంగానే ప్రాజెక్టుల‌ను చంపేసే కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్పుడు ప్లాంట్‌లో ప్ర‌మాదం జర‌గ‌డం అనుమానాల‌కు తావిస్తున్న‌ద‌ని, దానిని క‌ప్పిపెట్టాల‌ని చూస్తున్నార‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణను సీబీఐకి అప్ప‌గించాల‌ని, అప్పుడే నిజానిజాలు తెలుస్తాయ‌ని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా, శ్రీ‌శైలం విద్యుత్ ప్లాంట్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 9 మంది అధ‌కారులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు ఉద్యోగుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఎంపీ రేవంత్ను పోలీసులు డిండి వ‌ద్ద‌నే అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో పోలీసుల తీరుపై మాజీ ఎంపీ మ‌ల్లు ర‌వితో క‌లిసి రేవంత్ కొద్దిసేపు అక్క‌డే వాద‌న‌కు దిగారు. భాదితుల‌ను తాము ప‌రామ‌ర్శించ‌డంలో ప్ర‌భుత్వానికి అభ్యంత‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు రేవంత్‌ను అడ్డుకున్నారు. అనంత‌రం మ‌ల్లు ర‌వితో క‌లిసి ఆయ‌న‌ను ఉప్పునూత‌నల ఠాణాకు త‌ర‌లించారు.

కేసీఆర్‌పై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts