ప్రైవేట్ వైద్య‌శాల‌ల‌పై జ‌గ‌న్ సిరియ‌స్‌

August 25, 2020 at 1:27 pm

స్పంద‌న కార్య‌క్ర‌మంపై ఏపీలోని అన్నిజిల్లాల క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించారు. వ‌ర‌ద‌లు, సహాయ కార్య‌క్ర‌మాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు. రాబోయే చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో బాధితుల‌కు అద‌నంగా రూ.2వేల ప‌రిహారంతో పాటు, రెగ్యూల‌ర్‌గా ఇచ్చే రేష‌న్‌ను కూడా అద‌నంగా ఇవ్వాల‌ని, అందుకు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు.

కృష్ణ‌, గోదావ‌రిలో వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని సూచించారు. పారిశుద్య‌, క్లోరినేష‌న్ ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని, వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. స‌ప్టెంబ‌ర్ 7వ తేదీలోగా పంట న‌ష్టంపై అంచ‌నాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద స‌మ‌యంలో చాలా చ‌క్క‌గా స్పందించార‌ని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. కోవిడ్ స‌మ‌యంలో ప్రైవేట్ వైద్య‌శాల‌లు అధికంగా ఫీజులను వ‌సూలు చేస్తుండ‌డంపై సీరియ‌స్ అయ్యారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫీజుల‌ను వ‌సూలు చేస్తే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ప్రైవేట్ వైద్య‌శాల‌ల‌పై జ‌గ‌న్ సిరియ‌స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts