స్టార్ హీరోయిన్‌పై యువ‌కుడి అనుచిత వ్యాఖ్య‌లు

August 22, 2020 at 1:44 pm

రాజ‌కీయ నాయ‌కులు, స్టార్ హీరో, హీరోయిన్ల‌పై కామెంట్లు చేయ‌డం ఈ మ‌ధ్య ప‌రిపాటిగా మారిపోయింది. సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఈ తంతంగా మారి శృతిమించిపోయింది. అభూత క‌ల్ప‌న‌లు, అస‌త్యాల‌ను విరివిగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖ సినీ న‌టులు ఆ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్టులో శ‌త్రుఘ్న‌సిన్హా గారాల ప‌ట్టి, ద‌బాంగ్‌తో బాలివుడ్‌లో అడుగుపెట్టిన సోనాక్షిసిన్హా కూడా చేరిపోయారు. మ‌హ‌రాష్ట్ర‌కు చెందిన ఓ యువ‌కుడు సోనాక్షిపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పోలీసులు అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే..

మ‌హ‌రాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఓ 27ఏళ్ల యువ‌కుడు హీరోయిన్ సోనాక్షిసిన్హాను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తే సోష‌ల్‌మీడియాలో పోస్టు పెట్టారు. అది తెగ వైర‌ల్గా మారింది. అలా పోస్టు సోనాక్షి దృష్టికి వ‌చ్చింది. దీంతో ఆమె వెంట‌నే ముంబై సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌ద‌రు యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ ఆన్‌లైన్ వేధింపుల‌ను స‌హించ‌బోన‌ని, అందుకు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. స‌త్వ‌ర‌మే నిందితుడిని అదుపులోకి తీసుకోవ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంతో పాటు పోలీసుల‌కు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

స్టార్ హీరోయిన్‌పై యువ‌కుడి అనుచిత వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts