బిగ్ బ్రేకింగ్‌: 20 మంది టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా… ముహూర్తం ఫిక్స్‌…!

August 1, 2020 at 8:41 am

ఏపీ రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అమ‌రావ‌తి క‌థ సగానికి ప‌రిమిత‌మైంది. అమ‌రావ‌తి ఇక నుంచి కేవ‌లం శాస‌న రాజ‌ధానిగానే మిగిలిపోనుంది. శుక్రవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీసుకున్న నిర్ణయం.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఎగ్జిగ్యూటివ్ క్యాపిట‌ల్‌గా వైజాగ్‌, జ్యూడిషీయ‌ల్ రాజ‌ధానిగా క‌ర్నూలు ఉండ‌నున్నాయి. జ‌గ‌న్ తాను ముందు నుంచి క‌ట్టుబ‌డిన‌ట్టుగానే మూడు రాజ‌ధానులపై పంతంతో ఉండ‌డంతో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని పోరాటం చేస్తోన్న చంద్ర‌బాబుకు షాక్ త‌ప్పలేదు.

దీంతో చంద్ర‌బాబు దీనిపై స‌రికొత్త పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. అమరావతి రాజధాని చేయాలనీ మద్దతుగా మూడు రాజధానుల‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ చంద్రబాబు సహా ఇరవై మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరంతా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి నేడు లేదా రేపు రాజీనామాలు చేస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీకి దూరం అయ్యారు. ఇక ఇప్పుడు మిగిలిన 20 మందిలో చంద్ర‌బాబు స‌హా అంద‌రూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి స‌రికొత్త ఎత్తుగ‌డ వేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే జ‌ర‌గాల్సింది అంతా జ‌రిగిపోయాక చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

బిగ్ బ్రేకింగ్‌: 20 మంది టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా… ముహూర్తం ఫిక్స్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts