40గ‌జ‌ల్లోనే.. మోడ‌ల్ హౌస్ నిర్మాణం

August 19, 2020 at 1:54 pm

ఏపీ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే 30 ల‌క్ష‌ల మందిపేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేయాల‌ని భావిస్తున్న‌ది. అందులో భాగంగా ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డ‌మేగాకుండా ఇళ్ల‌ను క‌ట్టించాల‌ని యోచిస్తున్న‌ది. అందులో భాగంగా తాడే‌ల్లిగూడెం బోట్‌హౌస్ వ‌ద్ద ఇటీవ‌లే ఏపీ హౌసింగ్ శాఖ మోడ‌ల్ హౌస్ను నిర్మించింది.
మోడ‌ల్ హౌస్‌కు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. కేవ‌లం 40 గ‌జాల విస్తీర్ణంలోనే ఈ ఇంటిని హాల్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, వ‌రండాతో నిర్మించ‌డం గ‌మ‌నార్హం. అదీ రూ. 2.5ల‌క్ష‌ల వ్య‌యంతోనే కావ‌డం మ‌రో విశేషం.

స‌ద‌రు ఇంటిని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం ప్ర‌త్య‌క్షంగా ప‌‌రిశీలించారు. నిర్మాణంలో మెటీరియ‌ల్‌ను, క‌ల్పించ‌న వ‌స‌తుల‌ను త‌దిత‌ర అంశాల‌ను అడిగి తెలుసుకున్నారు. అధికారుల‌కు ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. మొత్తంగా మోడ‌ల్ హౌస్ నిర్మాణంపై సీఎం జ‌గ‌న్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.

40గ‌జ‌ల్లోనే.. మోడ‌ల్ హౌస్ నిర్మాణం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts