పూజలందుకుంటోన్న 9 అడుగుల ఖైరతాబాద్‌ గణేశుడు.. వారికి నో ఎంట్రీ!

August 22, 2020 at 10:06 am

తెలంగాణలో వినాయక చవితి వేడుకలంటే అందరి దృష్టి ఖైరతాబాద్ గ‌ణేశుడిపైనే ఉంటుంద‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏటా ఇక్కడ ప్రతిష్ఠించే భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. అయితే ప్రతి ఏడాది అత్యంత ఎత్తయిన గణనాథుడి విగ్రహం దర్శనమిచ్చే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఈ సారి 9 అడుగుల వినాయక విగ్రహం మాత్రమే కనపడుతోంది.

కరోనాకు ఔషధం తీసుకొచ్చే ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు గణేశుడు దర్శనిమిస్తూ పూజలందుకుంటున్నాడు. వినాయకుడి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకం ఉన్నాయి. ఆయనకు కుడివైపున మహాలక్ష్మీ, ఎడమవైపున సరస్వతి ఉన్నారు. అయితే కరోనా వైరస్ విజృంభణ కారణంగా కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు.

www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక మ‌రోవైపు గణనాధుడికి 100 కిలోల లడ్డూ ప్రసాదం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి సంస్థ 100 కిలోల లడ్డూను తయారు చేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సురుచి ఫుడ్స్‌ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వామి వారికి లడ్డూను కానుకగా పంపించారు.

పూజలందుకుంటోన్న 9 అడుగుల ఖైరతాబాద్‌ గణేశుడు.. వారికి నో ఎంట్రీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts