న‌టి శివ పార్వ‌తికి క‌రోనా.. ప్ర‌భాక‌ర్‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేస్తూ వీడియో!

August 19, 2020 at 10:52 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా అన‌తికాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు పాకేసి.. ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో క‌రోనా కాటేస్తోంది. దీంతో క‌రోనా పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇక సామాన్యులు, సెల‌బ్రెటీలు అని తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.

ఫస్ట్ టైం రిస్క్ తీసుకోలేదు.. రష్మీ ...

ప‌లు తెలుగు చిత్రాలు, సీరియ‌ల్స్‌ల‌లో న‌టించిన శివ పార్వ‌తి.. ప్ర‌స్తుతం టీవీ యాక్టర్ ప్రభాకర్ నిర్మిస్తున్న‌ వదినమ్మ సీరియల్‌లో న‌టిస్తున్నారు. అయితే తాజాగా శివ పార్వ‌తి పోస్ట్ చేసిన వీడియోలో.. తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ.. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా సోకి పదిరోజుల పాటు హాస్పటల్‌లోనే ఉన్నాను.. రెండు హాస్పటల్స్ మారాను. ఈ విషయం ప్రభాకర్‌కి కూడా తెలుసు. మా సీరియల్ యూనిట్‌కి కూడా తెలుసు. కానీ, త‌నను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

న‌టీన‌టుల‌కు ఇన్స్యూరెన్స్ చేయిస్తున్నార‌నే మాట ఎంత వ‌ర‌కు నిజం అని ప్ర‌శ్నించారు శివ‌పార్వ‌తి. ఒక వేళ త‌న‌కు అలాంటిది చేసి ఉంటే, త‌న‌కు వ‌ర్తిస్తుందా? లేదా? అని ఎందుకు ప‌ట్టించుకోలేదు? వ‌దిన‌మ్మ సీరియ‌ల్ ప్రొడ్యూస‌ర్ ప్ర‌భాక‌ర్ కూడా త‌న బాగోగులు అడ‌గ‌లేద‌ని చెప్పారు. ఎవరికి ఎవరూ తోడు ఉండరని అర్థమైంది. నేను ప్రభాకర్ గురించి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయను. ఎందుకంటే అది అంతే. మేం కూడా అలాగే ఉండాలని అర్థమైంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. అయితే నేను ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌క‌పోయినా.. జీవితా రాజశేఖర్ గారు నా పరిస్థితి తెలుసుకుని డాక్టర్స్‌తో మాట్లాడి నాకు సాయం చేశారు. నేను ప్రాణంతో బయటపడ్డాను అంటే వాళ్ల వల్లే అంటు చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం శివ పార్వ‌తి వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా.. ప్ర‌భాక‌ర్‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేస్తూ వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts