థియేట‌ర్‌లో ఫ్లాప్ అయిన అఖిల్ సినిమా అక్క‌డ మాత్రం దుమ్ము రేపుతోందిగా!!

August 6, 2020 at 8:32 am

అఖిల్ అక్కినేని, వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `మిస్టర్ మజ్ను`. అఖిల్‌కు ఇది మూడో సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.యస్.యెన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం గ‌త ఏడాది జనవరిలో విడుద‌లై బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

Mr. Majnu (2020) New Released Hindi Dubbed Full Movie | Akhil ...

ల‌వ‌ర్‌ బాయ్ లా అమ్మాయిలతో సరదాగా గడిపే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్) ని చూసి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్) ని ప్రేమిస్తుంది . అయితే నిక్కీ ప్రేమని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాడు విక్కీ . దాంతో నిక్కీ విక్కీ కి దూరంగా వెళ్ళిపోతుంది. నిక్కీ తనకు దూరమయ్యాకే ఆమె గొప్పతనం ఏంటో తెలుస్తుంది విక్కీ కి . దాంతో నిక్కీ ప్రేమ కోసం విక్కీ ఏం చేసాడు? చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారా? అన్నదే సినిమా.

రొటీన్ ప్రేమ క‌థే కావ‌డంతో తెలుగులో ఫ్లాప్‌గా నిలిచింది ఈ చిత్రం. కానీ, ఇప్పుడు యూ ట్యూబ్ లో మాత్రం ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఇటీవల హిందీ వర్షన్ లో సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు కోట్ల‌లో వ్యూస్ వ‌చ్చి చేరుతున్నాయి. అప్ ‌లోడ్ చేసిన 40 గంటల వ్యవధిలోనే ఈ సినిమా 20 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. ఆపై నెలరోజుల వ్యవధిలోనే 100 మిలియన్లు అంటే 10 కోట్ల వ్యూస్ సాధించిందని, 13 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

థియేట‌ర్‌లో ఫ్లాప్ అయిన అఖిల్ సినిమా అక్క‌డ మాత్రం దుమ్ము రేపుతోందిగా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts