ఆ భారీ సినిమా డైరెక్టర్ తో అఖిల్..?

August 11, 2020 at 12:10 pm

అఖిల్ అక్కినేని.. వి. వి. వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో `అఖిల్` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా కొట్ట‌లేదు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు వాసు వర్మలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఎప్పుడో సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూనే ఉంది. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా చేయనున్నాడు.

గ‌త ఏడాది చిరంజీవి తో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు. ఇటీవ‌ల సురేందర్ రెడ్డి చెప్పిన కథ బాగుండడంతో ఈ ప్రాజక్టు చేయడానికి అఖిల్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే మరి ఈ సినిమాలో హీరోయిన్ అలాగే మిగితా నటీనటులు ఎవరు అనే విషయం ఇంకా తెలియదు. త్వ‌రలోనే ఆ వివ‌రాలు కూడా తెలియ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఆ భారీ సినిమా డైరెక్టర్ తో అఖిల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts