వరద బాధితులకు అక్షయ్ భారీ స్థాయిలో ప్రకటించిన విరాళం

August 14, 2020 at 4:55 pm

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన బిహార్, అసోం రాష్ట్రాల బాధితులకు తన వంతు విరాళం ప్రకటించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.కోటి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రియాంక-నిక్​ జోనస్​, విరాట్​కోహ్లీ-అనష్క జోడిలు సైతం వరద బాధితులకు అండగా నిలిచారు. తమ వంతు విరాళాలు ఇవ్వడమే కాకుండా అభిమానులు ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కరోనా సంక్షోభంలో ప్రధాని ప్రారంభించిన పీఎం కేర్‌ ఫండ్‌కు అక్షయ్‌ కుమార్‌ రూ. 25 కోట్లు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ముంబయి కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు, కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముంబయి పోలీసులకు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు.ప్రస్తుతం అక్షయ్ చేతిలో ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్‌ పాండే’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘పృథ్వీరాజ్‌’ తదితర చిత్రాలున్నాయి.

వరద బాధితులకు అక్షయ్ భారీ స్థాయిలో ప్రకటించిన విరాళం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts