అన్నకు రాఖీ కట్టిన బన్నీ కూతురు.. వైర‌ల్ అవుతున్న ఫోటోలు!!

August 3, 2020 at 1:28 pm

సోదర, సోదరీ‌ బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి దేశవ్యాప్తంగాక‌రోనా కార‌ణంగా సాదాసీదాగా జరుగుతోంది. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. ఈ రాఖీ పండ‌గా రోజున రక్త సంబంధం ఉన్నా లేకున్నా.. కుల, మతాలకు అతీతంగా ప్రతి సోదరి సోదరునికి రాఖీ కడుతుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం అంద‌రూ ఎంతో ఘ‌నంగా జ‌రుపుకునే ఈ రాఖీ పండ‌గ‌.. ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా నిరాడంబరంగా జరుపుకుంటున్నారు.

arha ties rakhi to ayaan

 

ఇక సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతల వరకూ అందరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులపై రాఖీ కట్టి ప్రేమను చాటుతున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.

ఇక తాజాగా రాఖీ పండుగ సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూతురు అర్హ తన సోదరుడు అయాన్‌కు రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన తన కూతురు, కుమారుడి ఫొటోలను బన్నీతో పాటు ఆయన భార్య స్నేహ కూడా పోస్ట్ చేశారు. అభిమానులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

అన్నకు రాఖీ కట్టిన బన్నీ కూతురు.. వైర‌ల్ అవుతున్న ఫోటోలు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts