కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అల్లు అర్జున్‌ బిగ్ ఫైట్.. మ్యాట‌ర్ ఏంటంటే??

August 4, 2020 at 9:02 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో `పుష్ప` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు బన్నీ. సినిమా అంతా స్మగ్లింగ్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. యువసుధ బ్యానర్, జి ఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రం విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా రూపొందనుందని స‌మాచారం.

గ్యాస్ లీకేజ్‌తో ప్రాణాలు కోల్పోయిన సంఘటనను చూపిస్తూ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నారట. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బిగ్ ఫైట్ చేసే యువకుడిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ డిజైన్ చేశారని ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. కాగా, జనవరిలో షూటింగ్ మొదలుకానుంది. 2022 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్ల‌డించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అల్లు అర్జున్‌ బిగ్ ఫైట్.. మ్యాట‌ర్ ఏంటంటే??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts