కోర్టుకెక్కిన రైతులు: మూడు రాజధానులకు బ్రేక్?

August 3, 2020 at 11:13 am

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కారు.  తక్షణమే మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పాలనా వికేంద్రీకరణ, సి‌ఆర్‌డి‌ఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్ వేసింది. అలాగే జి‌ఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.

రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, సచివాయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. మరి హైకోర్టు తీర్పు రైతులకు మద్ధతుగా వస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. అమరావతి రైతులు మాత్రమే కాదు.. మూడు రాజధానులు వద్దంటూ ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాయి. తాజాగా అమరావతి కోసం జనసేన నేతలు కూడా నిరసనలు మొదలుపెట్టారు.

కోర్టుకెక్కిన రైతులు: మూడు రాజధానులకు బ్రేక్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts