
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వరుసగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అయితే తాజాగా ఏపీ ప్రజలను వాతావరణశాక హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా రాగాల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.